నేడు ఏపీ బీజేపీ అధ్యక్షుల పేర్లు అధికారిక ప్రకటన
నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు
నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పీఎన్వీ మాధవ్ లు మాత్రమే నిన్న నామినేషన్లు దాఖలుచేశారు. మరొకరు నామినేషన్లు దాఖలు చేయలేదు.
ప్రమాణ స్వీకారం...
దీంతో నేడు రెండు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. దీంతో రెండు రాష్ట్రాల బీజేపీ అగ్రనేతలు ఈ పదవీ బాధ్యతలను స్వీకరించే కార్యక్రమానికి హాజరు కానున్నారు. నేటితో పురంద్రీశ్వరి ఏపీ అధ్యక్షురాలిగా, కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవీ కాలం నేటితో పూర్తి కానుంది.