నానికి కేశినేని చిన్ని ఘాటు ఆన్సర్

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు

Update: 2025-05-13 05:21 GMT

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు అన్నదమ్ముల మధ్య ట్వీట్ వార్ తో పాటు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో మరొకసారి కేశినేని చిన్ని నానిపై ఫైర్ అయ్యారు.

తొత్తులకు సమాధానం ఇవ్వాల్సిన...
జగన్ తొత్తులకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని కేశినేని చిన్ని అన్నారు. తాము ధైర్యంగా మీడియా ముందుకు వస్తున్నామని, తాము ఏ తప్పు చేయలేదన్న కేశినేని చిన్న ధైర్యం లేని జగన్ తొత్తులు ఫేస్‍బుక్‍లో విమర్శలు చేస్తున్నారంటూ నానిపై ఘాటు విమర్శలు చేశారు. తాము జగన్ కక్కుర్తి సొమ్ముకు అలవాటు పడిన వ్యక్తులం కాదంటూ ఎంపీ కేశినేని చిన్ని జవాబిచ్చారు.


Tags:    

Similar News