ఎమ్మెల్సీ అనంతబాబుకు షాకిచ్చిన హైకోర్టు
ఎమ్మెల్సీ అనంతబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కలేదు
ఎమ్మెల్సీ అనంతబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి ఎస్సీ , ఎస్టీ కేసు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు స్టేకు నిరాకరించడంతో పునర్విచారణకు అడ్డంకులు తొలగిపోయినట్లేనని అంటున్నారు. అనంతబాబు ఈకేసులో ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు.
స్టేకు నిరాకరించడంతో...
తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనికి సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. దీనిపై పునర్విచారణకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై స్టే ఇవ్వాలంటూ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటీషన్ ను డిస్మిస్ చేసింది. ఈ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ, తదుపరి విచారణ కొనసాగించవచ్చని తెలిపింది.