Andhra Pradesh : ఒంగోలులో భూ ప్రకపంనలు

ఆంధ్రప్రదేశ్ లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు తెల్లవారుజామున ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వల్ప భూప్రకంపనలు కనిపించాయి

Update: 2025-09-24 03:18 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు తెల్లవారుజామున ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వల్ప భూప్రకంపనలు కనిపించాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఒంగోలులోని లాయర్ పేట్, సీఎస్ఆర్ శర్మ కళాశాలల సమీపంలో ఈ స్వల్ప భూప్రకంపనలు కనిపించాయి. రెండు సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కనిపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

అనేక సార్లు...
ప్రకాశం జిల్లా ఒంగోలుతో పాటు ముండ్లమూరు ప్రాంతాల్లో తరచూ భూప్రకపంనలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే సాధారణంగా జరిగే విషయమేనని, భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో తరచూ భూప్రకంపనలు వస్తుండటంతో అధికారులు లోతుగా అధ్యయనం చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Tags:    

Similar News