కడపలో మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
కడపలో మహానాడు ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు
కడపలో మహానాడు ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. అచ్చెన్నాయుడుతో పాటు మంత్రులు గొట్టిపాటి రవి, నారాయణ, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడపలో జరిగే మహానాడు గుర్తుండిపోతుందని తెలిపారు.
గతంలో కంటే భిన్నంగా...
గతంలో జరిగిన మహానాడులకు భిన్నంగా కడపలో ఉంటుందని మంత్రులు తెలిపారు. రాయలసీమ వాసుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మహానాడు నిర్వహిస్తామని చెప్పారు. రాయలసీమ డిక్లరేషన్ పై ప్రధానంగా మహానాడులో చర్చించి నిర్ణయం తీసుకుంటారని మంత్రులు తెలిపారు. మహానాడుకు వచ్చే నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలగాలని కోరారు.