Nara Lokesh: నేడు నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మక సంస్థకు లోకేశ్ శంకుస్థాపన

రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు నేడు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేస్తున్నారు

Update: 2026-03-12 02:32 GMT

రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు నేడు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేస్తున్నారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్, సిస్టమ్స్ సెంటర్ ను అభివృద్ధి చేయనున్న సంస్థ మొదటి దశ లో రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టుబడి పెట్టనుంది. దీని వల్ల 750 మందికిపైగా ఉద్యోగాలు లభించయాన్నాయి.

జువ్వెల దిన్నెలో...
నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ సెంటర్ ఏర్పాటుకు నేడు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ సెంటర్ ను ఏర్పాటుచేయనుంది. భారతదేశ సముద్ర, రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో ఈ ప్రాజెక్ట్ మైలురాయిగా నిలవనుంది. అధునాతన సముద్ర సాంకేతికతను ప్రోత్సహించడంతో పాటు మత్స్యరంగాన్ని బలోపేతం చేయనున్నారు.


Tags:    

Similar News