Nara Lokesh : నేడు ఢిల్లీకి మంత్రి లోకేశ్

నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్ బయలుదేరి వెళుతున్నారు

Update: 2025-12-01 03:36 GMT

నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్ బయలుదేరి వెళుతున్నారు. సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ బయల్దేరనున్న మంత్రి నారా లోకేశ్ రేపు పార్లమెంట్ హౌస్‌లో పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రమంత్రులతో వరసగా సమావేశాలు కానున్నారు. మెంథా తుపాను నష్టపరిహారంపై కేంద్రమంత్రి అమిత్‍షాను మంత్రి నారా లోకేశ్ కలవనున్నారు.

కేంద్ర మంత్రులను కలిసే...
రాష్ట్రానికి పెండింగ్ అంశాలపై ఎంపీలతో కలిసి కేంద్రమంత్రులతో నారా లోకేశ్ వరస భేటీలు కొనసాగనున్నాయి. మంత్రి నారా లోకేశ్ తో పాటు ఢిల్లీ పర్యటనకు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై లోకేశ్ కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి నారా లోకేశ్ అమరావతి రానున్నారు


Tags:    

Similar News