జగన్ వ్యాఖ్యలపై నారా లోకేశ్ ఏమన్నారంటే?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్ ఖండించారు

Update: 2025-03-05 11:47 GMT

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్ ఖండించారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ కి వచ్చిన మెజారిటీ ఎంత ? పవన్ కళ్యాణ్ కి వచ్చిన మెజారిటీ ఎంత ? అని లోకేశ్ ప్రశ్నించారు. వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? జనసేనకి ఎన్ని వచ్చాయి? నోరు ఉంది కదా అని ఏది పడితే అదే మాట్లాడి కించపరచడం నిజంగా బాధాకరం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

ప్రతిపక్ష హోదాపై...
ప్రతిపక్ష హోదాపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. తాము నిబంధనలకు లోబడి పనిచేసేవారమన్న లోకేశ్ పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం గా జడ్ కేటగిరీ భద్రత కల్పించామని, అదే జగన్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించామని లోకేశ్ వివరించారు. బెంగళూరులో ఉంటూ ఇక్కడ ఎన్నికల గురించి మాట్లాడితే ఎలా అని లోకేశ్ ప్రశ్నించారు.


Tags:    

Similar News