YSRCP : హాట్ కామెంట్స్ చేసిన మంత్రి గుడివాడ అమర్‌నాధ్

మంత్రి గుడివాడ అమర్‌నాధ్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ నుంచి చెల్లించిన పన్నులనే తిరిగి కేంద్రం రాష్ట్రానికి ఇస్తుందన్నారు

Update: 2023-11-16 06:13 GMT

ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ నుంచి చెల్లించిన పన్నులనే తిరిగి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తుందన్నారు. అంతే తప్ప ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం లేదన్నారు. 70 శాతం పోలవరం నిర్మించామని చెబుతున్న చంద్రబాబు అందులో 70 శాతం నిధులను కొట్టేశారని ఆరోపించారు. పోలవరం కట్టకుండానే నిధులను కాజేశారని అన్నారు. కట్టప్ప నాదెండ్ల మనోహర్ ఏదో ఒక సంస్థకు ఉచితంగా భూములు ఇస్తున్నామని లేని పోని ఆరోపణలు చేేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమే వారి పనిగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ ఎన్నికలకు తమకు సంబంధం లేదని ఆయన తెలిపారు.

తండ్రీ కొడుకులు వెన్నుపోటు...
నాడు ఎన్టీఆర్ ను నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిస్తే.. నేడు పవన్ కల్యాణ‌్‌ను ఆయన కొడుకు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం తప్ప నాదెండ్ల చేసేదేమీ లేదన్నారు. రాష్ట్రానికి గతం కంటే బాగానే పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు లేని పోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దావోస్ లో జరిగిన పారిశ్రామిక ఒప్పందాలు కార్యరూపం దాలుస్తాయని చెప్పారు.


Tags:    

Similar News