జూన్ 9న జగన్ ప్రమాణస్వీకారం.. విశాఖలోనే
జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణస్వీకారం జూన్ 9వ తేదీన చేయనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు
botsa satyanarayana
జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణస్వీకారం జూన్ 9వ తేదీన చేయనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. జగన్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమయిందని, దానిని ఎవరూ ఆపలేరని అన్నారు. జగన్ ను మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారని అన్నారు.
ఓటమి భయంతోనే...
టీడీపీ నేతలు శ్రేణులు ఓటమి భయంతో రెచ్చిపోతున్నారని, అయితే తమ అధినేత కను సైగ చేస్తే చాలు ఇక తట్టుకోలేరని బొత్స వార్నింగ్ ఇచ్చారు. కావాలని రెచ్చగొట్టవద్దని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా జరిగిన ఘటనలపై విచారణ జరుపుతామని బొత్స సత్యనారాయణ తెలిపారు. నిందితులను ఎవరినీ వదిలపెట్టబోమని కూడా అన్నారు. ఇప్పటికైనా సంయమనం పాటించాలని బొత్స సత్యనారాయణ తెలిపారు.