Midhun Reddy : మిధున్ రెడ్డి ఇంట్లో సోదాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి ఇంట్లో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు సోదాలు జరుపుతున్నారు

Update: 2025-10-14 07:14 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి ఇంట్లో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎ4 నిందితుడిగా మిధున్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో దాదాపు 72 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రస్తుతం మిధున్ రెడ్డి నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం నాలుగు చోట్ల ఏకకాలంలో సిట్ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.

సిట్ అధికారులు ...
మిధున్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరులో ఉన్న మిధున్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. మిధున్ రెడ్డికి ఇటీవల ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన తాను అమెరికాకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారణ జరుగుతున్న సమయంలోనే సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం విశేషం


Tags:    

Similar News