Andhra Pradesh : నేడు మిధున్ రెడ్డి పిటీషన్ పై విచారణ
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. తనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆయన వేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులను కోరింది. ఐక్యరాజ్యసమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ కు వెళ్లేందుకు అనుమతివ్వాలని వేసిన పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముంది.
అమెరికాకు వెళ్లేందుకు...
మిధున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉండటంతో పాటు బెయిల్ పై ఉన్నారు. పాస్ పోర్టును అప్పగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకూ న్యూయార్క్ లో నిర్వహించే సమావేశాలకు ఆహ్వానం అందడంతో తనకు విదేశీపర్యటనకు అనుమతివ్వాలని కోరడంతో నేటికి విచారణను ఏసీబీ న్యాయమూర్తి వాయిదా వేశారు.