Cyclone : పొంచి ఉన్న తుపాను ముప్పు.. కోస్తాకు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2023-12-01 05:12 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎక్కడ తీరం దాటుతుందన్న దానిపై ఇప్పి వరకూ స్పష్టత లేదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో తీరం దాటే అవకాశముంది. ఈ ప్రభావం తో ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

జాగ్రత్తచర్యలు...
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఆదివారానికి తుపానుగా మారుతుందని చెప్పింది. అయితే ఈ తుపాను ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్యలో తీరానికి చేరువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.


Tags:    

Similar News