Rain Alert : మరో మూడు రోజులు వర్షాలు... కొన్ని జిల్లాలకు అలెర్ట్ ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-10-06 04:37 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్సాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పొలాల్లో పనిచేసేవారు. పశువుల కాపర్లు పొలాల్లో చెట్ల కింద నిల్చుని ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

ఏపీలో రెడ్ అలెర్ట్...
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ,గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణాలో మూడు రోజులు...
తెలంగాణలోనూ మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈరో్ు నారాయణపేట, నాగర్ కర్రనూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వాగులు, నదులు పొంగి పొరలే అవకాశముండటంతో వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రమాదకరమని, అదే సమయంలో ఈతకు కూడా దిగవద్దని తెలిపింది.
Tags:    

Similar News