Weather Report : ఉదయం ఎండ..సాయంత్రం వర్షం.. ఇదేమి చోద్యం సోదరా?

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పడతాయని వాతావరణ శాఖ చెప్పింది

Update: 2025-10-08 04:19 GMT

ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పడతాయని చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా పేర్కొంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని కూడా సూచించింది. ఇక నదులు, వాగులు ఉప్పొంగుతున్న రెండు రాష్ట్రాల్లో ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రెడ్ అలెర్ట్ జారీ చేసిన...
రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్సాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముంది. ఏపీలోని విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ,గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం...
తెలంగాణలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. పగలు విపరీతమైన ఎండ, సాయంత్రానికి వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు సగటు కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే మరో రెండు రోజులు తెలంగాణలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈరోజు మహబూబాబాద్, సూర్యాపేట్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Tags:    

Similar News