Weatehr News : తీరం దాటిన వాయుగుండం.. మూడు జిల్లలాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు

ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2025-10-03 04:04 GMT

పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ నిన్న రాత్రి తీరం దాటింది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ నిన్న రాత్రి పారాదీప్ - గోపాల్ పూర్ మధ్య తీరం దాటింది. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కోస్తాంధ్ర ప్రాంతంలో...
ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎల్లో అలర్ట్:జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇరవై సెంటిమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు కోనసీమ జిల్లాలకు భారీ వర్ష సూచించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఈరోజు శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
విశాఖలో ఎక్కువగా...
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని సూచించింది. దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ప్రయాణాలు చేయవద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అవసరమైతే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని సూచించారు. విశాఖలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరొకవైపు ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తూ ఇరవై నాలుగు గంటలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

విశాఖ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ : 0891-2590100, 0891-2590102.
విశాఖ ఆర్డీవో ఆఫీసు కంట్రోల్‌ రూమ్‌ నెం : 8500834958.
భీమిలి ఆర్డీవో ఆఫీసు కంట్రోల్‌ రూమ్‌ నెం : 8074425598

తెలంగాణలో నాలుగు రోజులు...
వాయుగుండం ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బలమైన ఈదురుగాలులువీస్తాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది. వ్యవసాయ పనులకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని, చెట్లు, విద్యుత్తు స్థంభాల కింద నిలబడరాతని వాతావరణ శాఖ తెలిపింది. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఎవరూ వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, అలాగే స్నానాలకు దిగవద్దని హెచ్చరించింది.


Tags:    

Similar News