జగన్ ఫొటో ఉంటే తీసి పడేస్తాం
మడకశిర ఎమ్మెల్యే రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫొటో ఉంటే బయటపడేస్తామని హెచ్చరించారు
మడకశిర ఎమ్మెల్యే రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫొటో ఉంటే బయటపడేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మారిందని, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాదన్న విషయాన్ని నేతలతో పాటు అధికారులు కూడా గుర్తుంచుకోవాలని అన్నారు. ఎవరైనా మర్చిపోయి ఉంటే ఆ విషయాన్ని గుర్తు చేయడం తమ బాధ్యత అని రాజు అన్నారు.
జడ్పీ ఛైర్ పర్సన్ ను అవమానపర్చలేదు...
అనంతపురం జడ్పీ కార్యాలయంలో జగన్ ఫొటో ఎలా పెడతారని ఎమ్మెల్యే రాజు ప్రశ్నించారు. జడ్పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటో ఉండాల్సి ఉండగా ఇంకా అధికారులు జగన్ ఫొటోను ఉంచడాన్ని ఆయన తప్పుపట్టారు. అందువల్లనే తొలగించామని చెప్పారు. జడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మను అవమానపర్చలేదని ఎమ్మెల్యే రాజు తెలిపారు.