YSRCP : వైసీపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ.. దళితులకు ఇంతటి అవమానమా?
మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి రాసిన లేఖ పార్టీలో కలకలం రేపింది
third list of the in-charges of ysr congress party constituencies
వైసీపీ అధినాయకత్వంపై మరో ఎమ్మెల్యే మండిపడుతున్నారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడంపై అభ్యంతరం తెలిపారు. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి రాసిన లేఖ పార్టీలో కలకలం రేపింది. తాను విజయవాడలో ఉంటే గంట ముందు తనకు సమావేశం ఉందన్న విషయం చెబితే ఎలా అని ఆయన లేఖలో ప్రశ్నించారు.
తాను లేకుండానే...
ఎమ్మెల్యే లేకుండానే కార్యకర్తల సమావేశం నిర్వహించడానికి ఆయనెవరు అంటూ పరిశీలకుడు అశోక్‌కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో తనకు తెలియజేయడం మీటింగ్ కు హాజరు కాకూడదన్న ఉద్దేశ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు. దళిత నేతకు ఇదేనా మీరు చేసే సత్కారం.. ఇది అవమానం కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ లేఖ మడకశిర వైసీపీలో సంచలనంగా మారింది.