Tiruapathi : తిరుపతి ఎస్వీయూనివర్సిటీలో చిరుత సంచారం
తిరుపతిలోని ఎస్వీయూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపుతుంది.
తిరుపతిలోని ఎస్వీయూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. గత కొన్నాళ్లుగా చిరుత ఇక్కడే తిరుగుతుండటాన్ని స్థానికులు గుర్తించారు. సీసీటీవీ పుటేజీలోనూ చిరుత సంచారం కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎస్వీయూ పాపులేషన్ స్టడీస్, ఐ బ్లాక్ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలో సీసీటీవీల్లో రికార్డయ్యాయి.
కుక్కపై దాడి చేసి...
ఆ ప్రాంతంలో కుక్కపై చిరుత దాడి చేసిన దృశ్యాలు చూసిన విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రివేళ ఒంటరిగా బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా బితుబితుకుమంటూ చిరుత ఎప్పుడు వస్తుందోనన్న ఆందోళనతో గడుపుతున్నారు. ఇప్పటికే ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను హెచ్చరించారు. మరొకవైపు అటవీ శాఖ అధికారులు కూడా చిరుత సంచారంపై ఆరా తీస్తున్నారు