Leopard : శ్రీశైలం హైవేపై చిరుతపులి.. హడలిపోతున్న భక్తులు
శ్రీశైలంలో చిరుత పులి సంచారం భక్తులను ఆందోళనకు గురి చేసింది.
శ్రీశైలంలో చిరుత పులి సంచారం భక్తులను ఆందోళనకు గురి చేసింది. హైవేపై చిరుతపులి కనిపించడంతో భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం అందించారు. శ్రీశైలం హైవేపై డ్యామ్ వద్ద ఒక గోడపై చిరుతపులి కూర్చుని ఉండటం కనిపించిందని భక్తులు చెబుతున్నారు.
అటవీశాఖ అధికారులు...
ఆ ప్రాంతంలో వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుతపులి శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో దర్శనమివ్వడంతో భక్తులు ఆందోళనకు గురి చేస్తుంది. అటవీ శాఖ అధికారులు కూడా వెంటనే చిరుతపులి జాడ కనుగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానికులు, భక్తులు అలెర్ట్ గా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.