శ్రీశైలంలో చిరుత పులి
నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుత పులి ఒక ఇంట్లోకి ప్రవేశించింది.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుత పులి ఒక ఇంట్లోకి ప్రవేశించింది. సీసీ కెమెరాల ద్వారా చిరుతపులి కదలికలు రికార్డయ్యాయి. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరూ సాయంత్రం వేళ పాతాళగంగ వైపు ఒంటరిగా వెళ్లవద్దంటూ అధికారులు భక్తులను ఆదేశించారు. శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది.
ఇంట్లోకి ప్రవేశించి...
ఒక ఇంట్లోకి ప్రవేశించిన చిరుత పులి అక్కడే కాసేపు తిరిగి ఎటో వెళ్లిపోయింది. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పులి అడుగుల జాడ ద్వారా అటవీ శాఖ అధికారులు అది ఎటు వైపు వెళ్లిందీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో చిరుతపులి ఇక్కడే ఉంటుందని భావించిన అధికారులు అన్ని చోట్ల గాలిస్తున్నారు.