వైసీపీ నేత హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
కర్నూలు జిల్లాలోని వైసీపీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది
కర్నూలు జిల్లాలోని వైసీపీ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. పత్తి కొండ మాజీ ఎమ్మెల్యే భర్త హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. పదకొండు మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డిపై క్రిష్ణగిరి మండలంలో హత్య జరిగింది. ఈ దాడిలో నారాయణరెడ్డితోపాటు అతని అనుచరుడు సాంబశివుడు కూడా హత్యకు గురయ్యారు. నారాయణరెడ్డి అనుచరుడు కృష్ణమోహన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 18 మంది నిందితులపై కేసు నమోదు చేశారు.
పదకొండు మందికి...
కానీ ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కప్పట్రాళ్ల బొజ్జమ్మల పేర్లను హైకోర్టు ఆదేశాలతో తొలగించారు. కేసులో నిందితుడుగా ఉన్న ఒక వ్యక్తి మృతి చెందగా.. మిగిలిన నిందితులపై విచారించిన న్యాయస్థానం ఇందులో ప్రమేయం ఉన్న పదకొండు మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.