టీడీపీ మాజీ ఎంపీకి గుండెపోటు.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ గుండెపోటుకు గురయ్యారు.
tdp, candidate, mlc of local bodies, visakha district
తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ గుండెపోటుకు గురయ్యారు. ఆయనకు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికత్స కోసం విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఆసుపత్రి వద్దకు...
కొనకళ్లకు గుండె పోటు వచ్చిందని తెలియడంతో వెంటనే ఆసుపత్రి వద్దకు టీడీపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొనకళ్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈసారి ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ దక్కకపోయినా టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. దీంతోనే ఆయన అలసటకు గురై గుండెపోటుకు గురయ్యారని చెబుతున్నారు.