Andhra Pradesh : నేడు చెవిరెడ్డి బెయిల్ పిటీషన్ పై తీర్పు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక తీర్పు వెలువడనుంది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక తీర్పు వెలువడనుంది. ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు ను ఏసీబీ కోర్టు ఇవ్వనుంది. అయితే ఏసీబో కోర్టులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం తరుపున న్యాయవాదులు నేడు తీర్పు ఇవ్వవద్దంటూ పిటీషన్ వేశారు.
కౌంటర్ దాఖలు చేయాలని...
అయితే కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు నిందితులు తరుపున న్యాయవాదులకు నోటీసులు ఇచ్చింది. దీంతో నేడు ఈ బెయిల్ పిటీషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు చెప్పనుందా? లేక సిట్ తరుపున న్యాయవాదుల వాదనను అనుసరించి తీర్పును వాయిదా వేయనుందా? అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఐదుగురికి బెయిల్ లభించింది.