Andhra Pradesh : నేడు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ తో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరగనుంది.

Update: 2025-09-03 02:44 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరగనుంది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా హాజరు కానున్నారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ప్రెజెంటేషన్ తర్వాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేయనుంది.

పవన్ తో లంచ్ మీటింగ్...
అదే సమయంలో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలుతో పాటు తీసుకున్న రుణాలు, తీసుకోబోయే రుణాల వంటి వాటిపై చంద్రబాబు అధికారులతో ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు లంచ్ మీటింగ్ లో పాల్గొంటారు. వివిధ రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.


Tags:    

Similar News