YSRCP : నేడు వైసీపీ కీలక సమావేశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నేడు జరగేనుంది.

Update: 2025-10-07 02:27 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నేడు జరగేనుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపైన కూడా జగన్ నేతలతో చర్చించనున్నారు.

 ఉత్తరాంధ్ర పర్యటనపై...
అలాగే ఈరోజు జరిగే సమావేశంలో ఈనెల తొమ్మిదో తేదీన జగన్ ఉత్తరాంధ్ర పర్యటనపై కూడా చర్చించే అవకాశముంది. తాజాగా చిత్తూరు జిల్లాలో బయటపడిన నకిలీ మద్యం తయారీ అంశంపై కూడా చర్చించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు జగన్ భీమవరం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. పార్టీ నేత ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరు కానున్నారు.


Tags:    

Similar News