ఆ డ్రామాలేంటి చంద్రబాబు ? టీడీపీ అధినేత అరెస్టుపై కేఏపాల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఈరోజు ఉదయం (శనివారం) అరెస్టు చేశారు. అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లిన సమయంలో ఆయన చేసిన డ్రామాలు ఎవరికి ఊహ అందడం లేదని, కేఏ పాల్ విమర్శించారు. చంద్రబాబు అవినీతి చేశాడని 12,13 సెక్షన్లతో నోటీసులు ఇచ్చి, పోలీసులు ఆయనను అరెస్టు చేస్తుంటే, చంద్రబాబు పోలీసులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు.

Update: 2023-09-09 14:13 GMT

ఆ డ్రామాలేంటి చంద్రబాబు ?

టీడీపీ అధినేత అరెస్టుపై కేఏపాల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఈరోజు ఉదయం (శనివారం) అరెస్టు చేశారు. అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లిన సమయంలో ఆయన చేసిన డ్రామాలు ఎవరికి ఊహ అందడం లేదని, కేఏ పాల్ విమర్శించారు. చంద్రబాబు అవినీతి చేశాడని 12,13 సెక్షన్లతో నోటీసులు ఇచ్చి, పోలీసులు ఆయనను అరెస్టు చేస్తుంటే, చంద్రబాబు పోలీసులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా గుజరాత్ హోం మినిస్టర్ గా గుజరాత్ మారణహోమం కేసులో 18 నెలలు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి 16 నెలలు అవినీతి ఆరోపణలతో జైల్లో ఉండగా, సత్యం రామలింగ రాజు కొన్నేళ్లపాటు జైల్లో ఉన్నారన్నారు. లక్ష రూపాయల లంచం తీసుకున్న కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్షణ్ ను 4 ఏళ్లు జైల్లో ఉంచారనని వివరించారు. 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశాడని చంద్రబాబుపై ఆరోపణలను మనం చూశామని, అయితే అమెరికాలో ఉంటున్న నాపై ఏ ఆరోపణలు లేకుండా అవినీతి కేసులో 107 రోజులు జైల్లో పెట్టారన్నారు. మరి చంద్రబాబు అంటే పోలీసులకు ఎందుకింత భయం ? కోర్టుల్లో ఆయనకున్న కనెక్షన్లా ? ఆఫీసర్లా ? లేదా వీరిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగా ? అని ప్రశ్నించారు.రూ. 8 లక్షల కోట్లు చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ను రూ. 4000 కోట్లకు కేంద్రం అమ్మేస్తుంటే .. ఎవరూ పట్టించుకోకుంటే తాను నిర్వహించిన నిరవధిక నిరాహార దీక్షకు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ, స్టీలు ప్లాంటు వర్కర్లు మద్దతు ఇచ్చారని, మళ్లీ అదేకార్యక్రమం చేపడితే పోలీసులు తన మెడ, కాళ్లు, చేతులు విరగకొట్టారన్నారు. ఆరోగ్యం బాగోలేదని చెబితే పోలీసులు తనను విశాఖలోని కేజీహెచ్ లో పరీక్ష చేయించుకోమన్నారన్నారని, మాజీ ముఖ్యమంత్రికైతే ఒక చట్టం, సామాన్యులకైతే మరొక చట్టం అమలు చేస్తారా ? అని కేఏపాల్ మండిపడ్డారు. అన్ని సెక్షన్లతో కేసులుండగా, అరెస్టుకు ఎందుకు లేట్ చేశారని,ఒకవేళ అరెస్టు జరిగితే వెంటనే బెయిల్ ఇచ్చేస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. దీన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబును అరెస్టు చేయడంపై పవన్ స్పందిస్తూ ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా.. అనడాన్ని పాల్ విమర్శించారు. దీనిద్వారా పవన్ కల్వాణ్ ప్యాకేజీ స్టార్ అని తెలిసిపోయిందని, ఎంత డబ్బిస్తే అలా మాట్లాడతారని పాల్ ప్రశ్నించారు. స్టీలు ప్లాంట్ కోసం ధర్నాలు చేస్తుంటే ఒక్కసారి కూడా ఎందుకు రాలేదని పవన్ కల్యాణ్ ను ఆయన ప్రశ్నిస్తూ .. తనని అరెస్టు చేస్తున్నప్పుడు ఎందుకు ఖండించలేదన్నారు. జనసైనికులు దీనిని గుర్తించాలని, పవన్ ప్యాకేజీస్టార్ అని రుజువైందా అని అన్నారు . మీరంతా బయటకు వస్తే బడుగు, బలహీన వర్గాలను గెలిపించుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు.

Tags:    

Similar News