Andhra Pradesh : మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ
ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ అందింది
ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ అందింది. సచివాలయంలోని మంత్రి కార్యాలయానికి ఈ లేఖ చేరింది. ఈ లేఖలో మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు ప్రాణహాని కల్పిస్తామంటూ మావోయిస్టులు హెచ్చరించినట్లు లేఖలో పేర్కొన్నారు. మంత్రి కార్యాలయానికి పోస్టులో ఈ లేఖ పంపారు. దీంతో కందుల దుర్గేష్ పీఏ పోలీసులకు సమాచారం అందించారు.
ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై...
దీంతో పోలీసులు ఈ లేఖపై విచారణ జరుపుతున్నారు. మావోయిస్టులు నిజంగా ఈ లేఖ రాశారా? లేక మరెవరైనా ప్రత్యర్థులు భయపెట్టేందుకు ఈ లేఖ రాశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై అప్రమత్తమయిన పోలీసులు లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. కందుల దుర్గేష్ కు మావోయిస్టులు లేఖ రాయడం కొంత కలకలం రేపింది.