Ys Viveka : వైఎస్ వివేకా మృతి కేసులో సాక్షులు వరస మరణాలపై ఎస్సీ ఏమన్నారంటే?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వరసగా సాక్షులు మరణించడంపై కడప ఎస్పీ అశోక్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వరసగా సాక్షులు మరణించడంపై కడప ఎస్సీ అశోక్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరసగా నలుగురు సాక్షులు మరణించడంపై వారి బంధువులతో పాటు తమకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. వైఎస్ వివేకాహత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న మరణంపై ఆయన భార్య ఫిర్యాదు చేశారని, దానిపై విచారణ జరుపుతామని తెలిపారు.
నలుగురు సాక్షులు...
ఈ మేరకు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. రంగన్నకు ముందుకు సాక్షులుగా ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి మృతిపై కూడా తాము దర్యాప్తు చేస్తామని కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. లోతుగా దర్యాప్తు జరిపి మరణాల వెనక ఉన్న కారణాలను తెలుసుకుంటామని ఆయన తెలిపారు.