తిరుపతి తొక్కసలాట ఘటనపై క్రిమినల్ చర్యలు

వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వానికి నివేదిక న్యాయ కమిషన్ సమర్పించింది.

Update: 2025-07-25 03:42 GMT

వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వానికి నివేదిక న్యాయ కమిషన్ సమర్పించింది. తొక్కిసలాట ఘటనలో ఎస్పీ సుబ్బరాయుడు, అప్పటీ సీవీఎస్ శ్రీధర్ కు క్లీన్ చిట్ ఇస్తూ న్యాయ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు, వీరిద్దరికి సంబంధం లేదని న్యాయ కమిషన్ చెప్పింది.

ఆ ఇద్దరే...
ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఇద్దరని న్యాయ కమిషన్ పేర్కొంది. డీఎస్పీ రమణకుమార్‌, గోశాల డైరెక్టర్‌ హరనాథ్‌రెడ్డి ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించలేదని పేర్కొంది. టీటీడీ జేఈవో గౌతమిది కూడా వైఫల్యమేనని తెలిపింది. దీంతో ప్రభుత్వం డీఎస్పీ రమణకుమార్, హరనాథ్ రెడ్డిపై క్రిమినల్‌ చర్యలకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్‌ గౌతమిపై చర్యలకు జీఏడీకి సిఫార్సు చేసింది.


Tags:    

Similar News