రిమాండ్ పొడిగింపు

చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 24వరకూ పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

Update: 2023-09-22 05:58 GMT

చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 24వరకూ పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. మిమ్మల్ని కస్టడీకి అడుగుతున్నారని, మీ న్యాయవాదులు మాత్రం కస్టడీ అవసరం లేదని చెబుతున్నారని జడ్జి చంద్రబాబుకు తెలిపారు. ఎల్లుండి వరకూ జ్యుడిషియల్ కస్టడీలోనే మీరు ఉంటారని జడ్జి పేర్కొన్నారు. తనను అకారణంగా జైల్లో పెట్టారని, తన బాధ, ఆవేదన అంతా అదేనని ఆయన తెలిపారు. తన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, దర్యాప్తులో అన్ని విషయాలు తేలతాయి అని కూడా న్యాయమూర్తి అన్నట్లు తెలిసింది. చంద్రబాబు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నానని న్యాయమూర్తి తెలిపారు. జైల్లో ఇబ్బందులు ఎదురయితే తనకు చెప్పాలని న్యాయమూర్తి చంద్రబాబుతో అన్నారు.

తీర్పు వాయిదా...
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీఐడీ రిమాండ్‌ తీర్పు ను మధ్యాహ్యం రెండు గంటలకు వాయిదా వేసింది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. ఏసీబీ న్యాయమూర్తి మధ్యాహ్నం రెండు గంటలకు తీర్పు వాయిదా పడింది. క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కస్టడీపై తీర్పును న్యాయమూర్తి వెలువరించనున్నారు.


Tags:    

Similar News