Andhra Pradesh : లిక్కర్ స్కామ్ కేసులో నేడు సిట్ విచారణ
కల్తీ మద్యం కేసులో నేడు సిట్ ముందుకు జోగి సోదరుల కుమారులు రానున్నారు
నేడు సిట్ ముందుకు జోగి సోదరుల కుమారులు రానున్నారు. కల్తీ మద్యం కేసులో రాజీవ్, రోహిత్, రాకేష్, రామ్మోహన్ ను విచారించనున్నారు. వారినుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు సిట్ అధికారులు నేడు విచారణ చేయనున్నారు. ఇప్పటికే కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే.
అనిల్ చోక్రా విచారణలో...
మరొకవైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు అనిల్ చోక్రాను మూడో రోజు సిట్ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. ఈరోజు తో అనిల్ చోక్రా కస్టడీ ముగియనుంది. దీంతో ఈరోజు విచారణ కీలకంగా మారనుంది. మరొకవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఏ 51గా రోణక్ కుమార్ ను నేడు కోర్టులో హాజరు పర్చనున్నారు.