తూర్పు తీరంలో జెల్లీ ఫిష్‌ లు.. అందంగా ఉన్నాయని తాకకండి!!

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్ర తీరంలో బ్లూ బటన్‌ జెల్లీ ఫిష్, బ్లూ డ్రాగన్‌ జెల్లీ ఫిష్‌ అధికంగా సంచరిస్తున్నాయి.

Update: 2025-06-30 13:45 GMT

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్ర తీరంలో బ్లూ బటన్‌ జెల్లీ ఫిష్, బ్లూ డ్రాగన్‌ జెల్లీ ఫిష్‌ అధికంగా సంచరిస్తున్నాయి. అందంగా ఉన్నాయని తాకితే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉన్నారు. తీరంలో భారీ గాలులకు, సముద్రం ఆటుపోట్ల సమయాల్లో ఇవి ఒడ్డుకు కొట్టుకుని వస్తున్నాయి. అంతర్వేది బీచ్‌లో గుర్తించిన బ్లూ డ్రాగన్‌ జెల్లీ ఫిష్‌ విషపూరితమైనది. దీని శాస్త్రీయ నామం గ్లాకస్‌ అట్లాంటికస్‌. ఇది బ్లూ బటన్‌ జెల్లీ ఫిష్‌లను ఆహారంగా తీసుకుంటుంది. వీటిని తాకితే కుట్టే ప్రమాదం కూడా ఉంది. ఆ తర్వాత శరీరంపై దురదలు, దద్దుర్లు, మంటలు పుడతాయి. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం మరణాలు సంభవిస్తాయి.

Tags:    

Similar News