ఆయన్ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న జనసేన
కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త టి.వి.రామారావుపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త టి.వి.రామారావుపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. కొవ్వూరు నియోజకవర్గంలోని సహకార సొసైటీల నియామకాల్లో అన్యాయం జరిగిందని టి.వి.రామారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతలు ఆందోళన చేశారు. అయితే పార్టీ అధిష్టానాన్ని సంప్రదించకుండా టి.వి. రామారావు ఆందోళన చేయడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగేలా చర్యలు ఉన్నందున పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తక్షణమే తప్పించారు. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రామారావును ఆదేశించారు.