Janasena : నేటి నుంచి జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు

నేటి నుంచి జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Update: 2025-08-28 01:51 GMT

నేటి నుంచి జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్ కార్యారణను నిర్దేశించుకోనున్నారు. నేడు, రేపు జనసేన పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇప్పటికే విశాఖకు చేరుకున్న పవన్ కల్యాణ్ వారితో సమావేశమవుతారు.

మూడు రోజుల పాటు...
నియోజకవర్గాల వారీగా సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. అదే సమయంలో కొందరు ప్రముఖలతోనూ సమావేశం అవుతారు. ఈ నెల 30వ తేదీన జనసేన పార్టీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పదిహేను వేల మందికి ఆహ్వానాలు పంపారు. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశముంది.


Tags:    

Similar News