కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం

గోదావరి తీరంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది

Update: 2026-03-13 08:22 GMT

గోదావరి తీరంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. కాకినాడ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పెద్దపులి గంటగంటకూ తన అడ్రస్ మారుస్తోంది. మనుషులను చూస్తే పారిపోతుంది కానీ, పశువుల మీద మాత్రం పంజా విసురుతోంది.దీని కదలికలను కనిపెట్టడానికి మెడలో 'సాటిలైట్ కాలర్' వేశారు.

సిగ్నల్స్ అందకపోవడంతో...
అయినా సరే, దట్టమైన అడవిలోకి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ అందక ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. పులి కదలికలను కనిపెట్టడానికి ఉపయోగిస్తున్న సాటిలైట్ కాలర్ గంటకోసారి సిగ్నల్ పంపిస్తుందని అధికారులు చెబుతున్నారు. పులిని పట్టుకున్నాక పాపికొండలు నేషనల్ పార్క్ వంటి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టే అవకాశం ఉందని తెలిపారు. అప్పటి వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.


Tags:    

Similar News