Nara Lokesh : క్షమాపణలు చెప్పిన మంత్రి లోకేశ్

నాణ్యత లేని మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2026-03-13 08:12 GMT

నాణ్యత లేని మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి లోకేశ్ క్షమాపణలు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా దేవునిచెరువు పాఠశాలలో ఘటనపై లోకేశ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారుప్రతి విద్యార్థికి ఉత్తమ సంరక్షణ, నాణ్యమైన సేవలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని లోకేశ్ చెప్పారు.

ఆహార నాణ్యతపై...
ఆహార నాణ్యత తక్కువగా ఉందని సమాచారం రాగానే చర్యలు తీసుకున్నామన్న లోకేశ్ విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఏజెన్సీని మార్చడంతో పాటు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేమని, ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని మంత్రి లోకేశ్ చెప్పారు.


Tags:    

Similar News