తిరుమలలో ఇక అక్షర గోవిందం

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2026-03-13 11:46 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. బాసర తరహాలో తిరుపతిలో అక్షరాభ్యాసం సౌకర్యం కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్రీవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేసుకునేందుకు అవకాశం భక్తులకు కల్పించింది. వకుళమాత ఆలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించనున్నారు.

వకుళామాత ఆలయంలో...
'అక్షర గోవిందం' పేరుతో కొత్త కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. బాసర ఆలయం తరహాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అక్షరాభ్యాసం తర్వాత ఏడు వస్తువులతో ప్రత్యేక కిట్ ను కూడా పంపిణీ చేయనుంది.


Tags:    

Similar News