Jana Sena : నేడు ఏపీలో జనసేన పండగ సందడి

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది అయిన సందర్భంగా నేడు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తుంది.

Update: 2025-06-04 03:54 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది అయిన సందర్భంగా నేడు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తుంది. వైసీపీ ప్రభుత్వం పీడ విరగయిందని తెలుపుతూ అందరూ పండగ చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. ఉదయం అందరి ఇళ్ల ముందు రంగవల్లులు అద్ది తమ ఆనందాన్ని తెలియచేయాలని కోరారు.

ఫొటోలను అప్ లోడ్ చేయాలని...
అలాగే రాత్రికి టపాసాలు పేల్చి కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకు పండగ చేసుకోవాలని సూచించారు. ఒకే రోజు సంక్రాంతి, దీపావళి పండగలు చేసుకోవాలని, అలా కార్యక్రమాలు చేపట్టిన జనసేన నేతలు డిజిటల్ మాధ్యమం ద్వారా ఫొటోలను అప్ లోడ్ చేయాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. వైసీపీ చేపట్టిన విద్రోహ దినానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జనసేన చేపట్టింది.


Tags:    

Similar News