వైసీపీ హిందూ ద్రోహి : నాగబాబు
జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మరో వీడియో విడుదల చేశారు.
జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మరో వీడియో విడుదల చేశారు. జగన్ హిందూ ద్రోహి అంటూ ఆయన ఈ వీడియోలో వ్యాఖ్యానించారు. ఇది హి పూర్వకాలంలో మంత్రాలకు చింత కాయలు రాలతాయని, సిద్ధులు నీటితో దీపాలు వెలిగించారని అంటే నమ్మే వాళ్లం కాదని, కానీ మన జగన్ బాబా మాత్రం పాలు, నెయ్యి లేకుండానే తిరుమల లడ్డూను తయారు చేశారన్నారు. జగన్ దొంగ బాబాగా మారి వైసీపీ హయాంలో టీటీడీ ఛైర్మన్ చుక్కపాలు, నెయ్యి కానీ లేకుండా ప్రమాదకరమైన కెమికల్స్ తో లడ్డూను తయారు చేశారని నాగబాబు అన్నారు.
కెమికల్స్ తో తయారు చేసిన నూనెతో...
సిట్ ఏడాదిన్నర పాటు విచారించి నిజాలను బయట పెట్టిందన్నారు. చెత్త ఎస్సెన్స్, కెమికల్స్ ను లడ్డూ తయారీలో వాడారని నాగబాబు అన్నారు. తెలిసి తప్పు చేస్తే ఏమి అనాలని నాగబాబు ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నిబంధనలను మార్చి అనర్హులైన వారికి టెండర్లు కట్టబెట్టారన్నారు. దొంగ డెయిరీలతో నమోదయిన కంపెనీ నుంచి సేకరించిన కెమికల్స్ తో సప్లయ్ చేసిన నూనెతో లడ్డూ తయారైందని అన్నారు.