ప్రకాష్ రాజ్ కు జనసేన కౌంటర్

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు జనసేన కౌంటర్ ఇచ్చింది

Update: 2025-07-12 07:40 GMT

prakash raj

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు జనసేన కౌంటర్ ఇచ్చింది. రాజ్యసభ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను రాష్ట్ర భాషగా గుర్తించాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఎక్స్ లో స్పందిస్తూ ఈ రేంజ్ కు అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. అంటూ.. పవన్ ను ప్రకాష్ రాజ్ విమర్శించిన నేపథ్యంలో జనసేన రియాక్ట్ అయింది.

అమ్ముడుపోవడం అంటే ...
అమ్ముడుపోవడం అంటే ఇది అంటూ ప్రకాష్ రాజ్ ఓ వీడియోని జనసేన పోస్ట్ చేసింది. అంతేకాని మాతృభాషను కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం కాదని, అసలు ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పంటే నువ్వు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేయ్యగలవా? అని జనసేన ప్రకాష్ రాజ్ ను ప్రశ్నించింది.


Tags:    

Similar News