జగన్ ను రాజకీయాల్లో లేకుండా చేస్తాం
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ను రాజకీయాల నుంచి లేకుండా చేస్తామని అన్నారు
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ను రాజకీయాల నుంచి లేకుండా చేస్తామని అన్నారు. వైసీపీ త్వరలోనే కుప్పకూలిపోతుందని ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వైసీపీ నేతలతో పాటు ఒక వర్గం మీడియా బురద చల్లేందుకు ప్రయత్నిస్తుందన్నారు ఆదినారాయణరెడ్డి.
వైసీపీ కుప్పకూలడం...
అయితే తమ నియోజకవర్గం పరిధిలో ఉన్న సిమెంట్ పరిశ్రమల నుంచి వైసీపీ నేతలు లబ్ధిపొందుతున్నారన్న ఆదినారాయణ రెడ్డి జమ్ముకశ్మీర్ ముష్కరుల కంటే ఇక్కడున్నవారు ఇంకా డేంజర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైసీపీకి 11 కూడా సీట్లు కూడా రావంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.