YSRCP : సజ్జల విషయంలో జగన్ స్టాండ్ ఇదేనా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే ఇప్పుడున్నారు

Update: 2025-11-28 09:05 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే ఇప్పుడున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఆయన పక్కన ఉన్నవారంతా ఒక్కొక్కరూ విడిచిపెట్టి వెళ్లిపోయారు. గతంలో వైఎస్ జగన్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయన వెంట ఉండేవారు. అయితే అధికారులు అక్రమ మద్యం కేసులో అరెస్టయ్యారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే మిగిలారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మౌనంగానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖలపై పెత్తనం చేసినట్లు నాడు ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సజ్జలపై కేసులు నమోదవుతాయని భావించింది.

రెండేళ్లు గడుస్తున్నా...
అయితే కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు కాకపోవడంతో టీడీపీ సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కానీ సజ్జల పై నమోదు చేయడానికి సరైన ఆధారాలు దొరకడం లేదని, అందుకే కేసులు నమోదు కావడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ పార్టీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చంద్రబాబుపై కేసులు తిరగదోడతామని సజ్జల ప్రకటించడం చూస్తుంటే ఆయన కు ధైర్యం వచ్చినట్లే కనిపిస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ చెప్పే ఆదేశాలను అమలుపర్చి నాడు టీడీపీ, జనసేనలకు టార్గెట్ అయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డిపైన కూడా అనేక కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో ముందస్తుబెయిల్ తెచ్చుకున్న సజ్జల ప్రస్తుతం బిందాస్ గా ఉన్నారు.
కేసులు నమోదయినా...
సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలోనూ ఆయన అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై కేసు నమోదుతో పాటు భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. అయినా సరే అందులోనూ ఆధారాలు లభించలేదు. పది నెలల నుంచి మౌనంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సజ్జల యాక్టివ్ అవ్వడంతో ఇక నేతలు కూడా రోడ్డు మీదకు వస్తారని చెబుతున్నారు. జగన్ కూడా బెంగళూరు నుంచి విజయవాడకు టూర్ వేస్తుండటంతో రాష్ట్రంలో పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకునేందుకు ఉపయోగపడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి వైసీపీలో కీలకంగా మారుతున్నారు. జగన్ కూడా రాజీనామాలు చేసిన మాట విని ఆయనను పక్కన పెట్టే ప్రయత్నం చేయడం లేదు. రానున్న రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మరింత కీలకంగా పార్టీలో మారనున్నారన్నది వాస్తవం.


Tags:    

Similar News