Leopard : మహానందిలో మళ్లీ పులి... మళ్లీ అదే చిరుతపులి?
మహానందిలో మరోసారి పులి సంచారం భక్తులను కలవరపాటుకు గురి చేసింది
మహానందిలో మరోసారి పులి సంచారం భక్తులను కలవరపాటుకు గురి చేసింది. పులి సంచారాన్ని గుర్తించిన స్థానికులు, భక్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మహానందిలో కొన్నాళ్ల క్రితం పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. పశువులపై దాడి చేయడంతో చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
తాజాగా చిరుత పులి సంచారం...
నంద్యాల నియోజకవర్గంలోని మహానందిలో పులిసంచారం ఉందని అధికారులు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా చిరుతపులి కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరోసారి చిరుతపులి కనిపించడంతో రాత్రివేళ భక్తులు ఒంటరిగా బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. పశువుల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.