Andhra Pradesh : నేటి నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా దీనిని చేపట్టనున్నారు.

Update: 2023-11-15 03:41 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా అధికారులు కులగణన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఐదు ప్రాంతాల్లో నేడు కులగణన ప్రారంభం కానుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మూడు గ్రామ సచివాలయాలు, రెండు వార్డు సచివాలయాల పరిధిలో కుల గణనను ప్రారంభించనున్నారు.

కలెక్టర్ల పర్యవేక్షణలో...
జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలోనే కులగుణన జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత పెరగనుంది. తమ సామాజికవర్గంలో ఎంతమంది ఉన్నారన్న సంఖ్యను తేల్చాలని గత కొంతకాలంగా డిమాండ్ వినపడుతుండటంతో ప్రయోగాత్మకంగా ఈ కులగణన కార్యక్రమాన్ని చేపట్టనుంది. కుల సంఘాల నేతలు కూడా దీనికి హాజరై తమ సామాజికవర్గంలో ఉన్న వారి సంఖ్య గురించి వివరించనున్నారు.


Tags:    

Similar News