జగన్ కు బాలకృష్ణ వార్నింగ్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు

Update: 2022-09-24 05:11 GMT

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదన్నారు. ఎన్టీఆర్ తెలుగుజాతికి వెన్నుముక అని బాలకృష్ణ అన్నారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు మార్చారని, కొడుకు అధికారంలోకి వచ్చి యూనివర్సిటీ పేరు మార్చారని ఆయన మండి పడ్డారు. నందమూరి బాలకృష్ణ ఈ విషయంపై ట్వీట్ చేశారు.

సిగ్గులేని బతుకులు...
పంచభూతాలు ఉన్నాయి జాగ్రత్త అంటూ బాలకృష్ణ హెచ్చరించారు. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన బిక్షతో బతుకుతున్న నేతలున్నారని, శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అని అన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్ అని కామెంట్ అన్నారు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారని ఆయన హెచ్చరించారు.


Tags:    

Similar News