నేడు సత్తెనపల్లి కేసుపై క్వాష్ పిటీషన్ విచారణ
నేడు వైసీపీ మాజీ మంత్రుల క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది.
నేడు వైసీపీ మాజీ మంత్రుల క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనిలపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలని మాజీ మంత్రులు హైకోర్టులో పిటీషన్ వేశారు. జగన్ సత్తెన పల్లి పర్యటనలో మరణించిన సింగయ్య మృతి కేసులో వీరిని నిందితులుగా చేర్చారు. దీంతో వీరు తమపై అక్రమంగా ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని వారు తమ పిటీషన్ లో పేర్కొన్నారు.
మాజీ మంత్రులు...
జగన్ సత్తెన పల్లి నియోజకవర్గం పర్యటనలో భాగంగా వెళుతున్న సమయంలో జగన్ వాహనం ఢీకొట్టి సింగయ్య మరణించారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఏ 2గా జగన్ ను చేర్చారు. మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజని కూడా అదే వాహనంలో ఉండటంతో వారి పేర్లు కూడా చేర్చటంతో వారు తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని కోరుతున్నారు.