Breaking : జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేష్ భార్య హైకోర్టులో పిటీషన్ వేసింది. తమ ఇంటిపై దాడి జరిగిందని, పోలీసుల చేత భద్రత కల్పించాలని పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన హైకోర్టు జోగి రమేష్ ఇంటి వద్ద పటిష్టమైన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరింది.
శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంత వరకూ...
శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంత వరకూ భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే నిన్న ఘటన తర్వాత ఎలాంటి ఘటనలు జరగలేదని, పోలీసులతో భద్రత కల్పించామని ప్రభుత్వం తరుపున న్యాయవాది హైకోర్టుకతె తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.