తిరువూరులో భారీ బందోబస్తు.. నేడు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్బంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు

Update: 2025-06-02 03:23 GMT

తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్బంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీసీపీ మహేశ్వర రాజు, ఏసీపీ మైలవరం ప్రసాదరావు మరియు సీఐ గిరిబాబు ఆదేశాలుతో 240 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందికి తెలియజేశారు.

వారికే అవకాశం...
అలాగే వార్డ్ కౌన్సెలర్స్ మినహా మిగతా ఎవ్వరూ రాకూడదని ఎటువంటి అల్లర్లు గొడవలకు పాల్పడకూడదని 144 సెక్షన్ అమలులో ఉందని తిరువూరు ప్రజలకు తెలియజేశారు. తిరువూరు పట్టణంలో భారీ పోలీసులను మొహరించారు. ఇప్పటికే కోరం లేక రెండుసార్లు వాయిదా పడటంతో ఈసారి తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకునే అవకాశముంది.


Tags:    

Similar News