Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతుంది
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతుంది. భారీ వర్షాలకు, ఎగువ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు ఐదు గేట్లను పది అడుగులు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత ఇన్ ఫ్లో 2,32,290 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 2,01,743 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
ఐదు గేట్లు ఎత్తి...
శ్రీశైలం జలాశయంపూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులకు చేరిందని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు లోని కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.